కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్లో తీవ్ర కలకలం సృష్టించిన కోఠీ ఏటీఎం వద్ద కాల్పుల కేసు (Koti Gun Fire Case)లో పోలీసులు పురోగతి సాధించారు. కాల్పులు జరిపి నగదు దొంగలించిన ఇద్దరు వ్యక్తుల్లో ఒకరిని పోలీసులు నేడు హర్యానాలో పట్టుకున్నారు. మరో నిందితుడి కోసం యూపీ, హర్యానాలో గాలిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే కాల్పులు జరిపిన నిందితులకు ఆశ్రయం ఇచ్చిన పాతబస్తీ వాసిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీళ్లు యూపీకి చెందిన వారుగా భావిస్తున్నారు. గత మూడు నెలల నుంచి దోపిడీలకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ గ్యాంగ్ కేరళకు చెందిన వ్యాపారవేత్తపై కాల్పులు జరిపి రూ.6 లక్షలు దోపిడీ చేశారు.
Read Also: బ్యాంకు నుంచి 2.7కిలోల ఆభరణాలు కాజేసిన ఉద్యోగి
Follow Us On: Instagram


