epaper
Wednesday, February 18, 2026
epaper

‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెకండ్ సింగిల్ బిగ్ అప్డేట్

కలం, సినిమా : పవర్‌స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan), స్టార్ డైరెక్టర్ హరీశ్ శంకర్(Harish Shankar) డైరక్షన్‌లో తెరకెక్కిన బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ “ఉస్తాద్ భగత్ సింగ్”(Ustaad Bhagat Singh). మైత్రీ మూవీస్ నిర్మాణంలో ఎంతో గ్రాండ్‌గా తెరకెక్కిన ఈ మూవీ మార్చి26, 2026 రిలీజ్ అవుతుంది. గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత పవర్ స్టార్, హరీశ్ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో మరోసారి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా పవన్ కల్యాణ్ కనిపించనున్నారు.

క్యూట్ బ్యూటీస్ శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్స్‌గా నటిస్తుండగా.. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ సింగల్ ఫుల్ ట్రెండింగ్ అయింది. తాజాగా సెకండ్ సింగల్‌కి సంబంధించి మేకర్స్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ అంటూ సాగే ఆ సాంగ్ ఫిబ్రవరి 22 న రిలీజ్ చేస్తున్నట్లు స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. రీసెంట్ గా “ఓజీ” సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న పవర్ స్టార్ ఈ సినిమాతో మరో సూపర్ హిట్ అందుకునేందుకు సిద్దం అయ్యారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>