epaper
Wednesday, February 18, 2026
epaper

రాజకీయ స్థిరత్వంతోనే ట్రేడ్​ డీల్స్​ : ప్రధాని మోదీ

కలం, వెబ్​డెస్క్: తమ పాలనలో రాజకీయ స్థిరత్వం కారణంగానే 38 దేశాలతో భారత్​ వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోగలిగిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అన్నారు. తయారీ, సేవా రంగం, ఎంఎస్​ఎంఈ విభాగాల్లో మన దేశం బలంగా ఉండడం ట్రేడ్​ డీల్స్​ను (Trade Deals) మనకు అనుకూలంగా మార్చుకోగలిగామని తెలిపారు. ప్రముఖ వార్తా సంస్థ పీటీఐకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ అనేక అంశాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా ఇటీవలి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల గురించి వెల్లడించారు. ‘రాజకీయ స్థిరత్వం, అంచనాలు పెట్టుబడిదారుల్లో భారత్​పై నమ్మకం పెంచాయని’ ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

ఇప్పటికే అమెరికా, ఈయూతోపాటు గల్ఫ్​ కంట్రీస్​తోనూ భారత్​ ఎఫ్​టీఏ కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. అంతకుముందు సైతం మరికొన్ని ఒప్పందాలు చేసుకుంది. త్వరలో 6 దేశాల గల్ఫ్​ కోఆపరేషన్​ కౌన్సిల్​(జీసీసీ)తో ట్రేడ్​ డీల్​ సైతం తుది దశలో ఉంది. ఇది పూర్తయితే గత కొన్నేళ్లలో 9 ఎఫ్​టీఏల ద్వారా 38 దేశాలతో భారత్​ ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు అవుతుంది. దీని గురించే పీఎం మోదీ ప్రస్తావించారు.

కాగా, యూపీఏ హయాంలో జరిగిన ఆర్థిక అవకతవకలు, అవినీతి కారణంగా కొన్నేళ్ల పాటు భారత్​ ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని కలిగించలేకపోయిందని ప్రధాని విమర్శించారు. ఎన్​డీఏ హయాం భారత్​ సర్వతోముఖాభివృద్ధికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. దీనిని కేవలం కాగితాలకే పరిమితం చేయకుండా ఆచరణలోనూ చూపిస్తోందని స్పష్టం చేశారు.

ప్రైవేటు రంగం గురించి మాట్లాడుతూ.. మార్జిన్లను కాపాడుకోవడంపై తక్కువ దృష్టి పెట్టి, పరిశోధన, తయారీ సప్లయ్ చైన్​, నాణ్యతపై ఎక్కువ పెట్టుబడి పెట్టాలని పీఎం సూచించారు. అదే సమయంలో లాభాలు పెరిగితే, వాటి ఫలాలను ఉద్యోగులు/కార్మికులతో పంచుకోవాలని చెప్పారు.

‘వికసిత్​ భారత్’కు (Viksit Bharat) తదుపరి అడుగు ఆవిష్కరణలు, దీర్ఘకాలిక సామర్థ్యం, పోటీ ప్రపంచంలో ప్రైవేటు రంగం చేసే సాహసోపేతమైన పెట్టుబడిపై ఆధారపడి ఉంటుందని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. పెరుగుతున్న ముప్పు కారణంగా రక్షణ వ్యవస్థను మరింత ఆధునికీకరించాల్సిన అవసరముందని ప్రధాని పేర్కొన్నారు. ముఖ్యంగా లేటెస్ట్​ టెక్నాలజీకి అనుగుణంగా ఆయుధ సంపత్తిని బలోపేతం చేయాలన్నారు. అందుకే కేంద్ర బడ్జెట్​లో ఈ రంగానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చినట్లు ప్రధాని వివరించారు. ‘వికసిత్​ భారత్​’ సాకారం కావాలంటే రక్షణ రంగం కూడా బలంగా ఉండాలని ఆయన స్పష్టంచేశారు.

Read Also: సీఎం రేవంత్​పై రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>