కలం, వరంగల్ బ్యూరో : వరంగల్ నగరంలో అన్యాక్రాంతమైన దేవాలయ భూములను కాపాడతనని మంత్రి కొండా సురేఖ (Konda Surekha) తెలిపారు. ఆదివారం మహా శివరాత్రి పర్వదినం పురస్కరించుకుని మంత్రి కొండా సురేఖ వరంగల్ లోని పలు శివాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. కాశిబుగ్గలోని కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయంలో అర్చన, అభిషేకం నిర్వహించారు. అనంతరం వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని పలు ఆలయాల్లో పూజలు చేశారు. మహా శివరాత్రి సందర్భంగా తెలంగాణలోని అన్ని శైవక్షేత్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు.
Read Also: వారమే గడువు.. పాక్ సైన్యానికి బీఎల్ఏ వార్నింగ్
Follow Us On: X(Twitter)


