కలం, సినిమా : మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ (Ram Charan), టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సనా(Buchi Babu Sana) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “పెద్ది” (Peddi). వృద్ధి సినిమాస్ నిర్మాణంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ బిగ్గెస్ట్ మూవీ ఏప్రిల్ 30న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన క్యూట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. దర్శకుడు బుచ్చిబాబు ఈ సినిమాలో రామ్ చరణ్‌ను మరింత పవర్ఫుల్‌గా చూపించనున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్, టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. పెద్ది సినిమా చూసేందుకు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉంటే నేడు బుచ్చిబాబు (Buchi Babu Sana) బర్త్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ చరణ్ చేసిన ట్వీట్ బాగా వైరల్ అయింది. ఈ సంవత్సరం బుచ్చిబాబు కష్టానికి అద్భుతమైన ఫలితం రావాలని, భవిష్యత్‌లో మరిన్ని గొప్ప ప్రొజెక్ట్స్‌లో కలిసి పనిచేయాలని చరణ్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం పెద్ది(Peddi) షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. దీనితో బుచ్చిబాబు బర్త్డే వేడుకలను సెట్స్‌లోనే మూవీ యూనిట్ ఎంతో గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేశారు. ఆ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


