కలం, వరంగల్ బ్యూరో: అక్షర చిట్ ఫండ్స్ (Akshara Chit Funds) డైరెక్టర్ పేరాల శ్రీవిద్య (Perala Srividya)ను శనివారం రాత్రి సుబేదారి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. శ్రీవిద్య 2022లో సుబేదారి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో పోలీసులకు దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్నారు. తాజాగా బెంగళూరు నుంచి అమెరికాకు వెళ్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు పథకం ప్రకారం బెంగుళూరు విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు. శనివారం రాత్రి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ఆమెకు రిమాండ్ విధించడంతో పోలీసులు నర్సంపేట సబ్ జైల్‌కు తరలించారు.
Read Also: మెక్ డొనాల్డ్స్ ఫ్రాంచైజీలో కల్తీ ఆహారం కలకలం
Follow Us On: X(Twitter)


