epaper
Wednesday, February 18, 2026
epaper

సీఎం, మంత్రుల పేరిట భ‌ట్టి విక్ర‌మార్క పూజ‌లు

కలం, ఖమ్మం బ్యూరో: మహా శివరాత్రి (Shivaratri) పర్వదినాన్ని పురస్కరించుకొని నేడు ఉద‌యం ఖమ్మం (Khammam) జిల్లా మధిరలోని గంగా పార్వతీ సమేత మృత్యుంజయ స్వామి గర్భాలయంలో డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క (Bhatti Vikramarka) ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, కేబినెట్ మంత్రుల పేరిట డిప్యూటీ సీఎం దంప‌తులు గోత్ర నామాలతో అర్చన చేయించారు. అలాగే వైరా మండలం స్నానాల లక్ష్మీపురం గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని డిప్యూటీ సీఎం దంప‌తులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవస్థానం వేద పండితులు పూర్ణకుంభంతో వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి, వేద ఆశీర్వచనం అందుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) రాష్ట్ర ప్రజలకు మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి సుభిక్షంగా ఎదగాలని, ప్రతి కుటుంబ ఆర్థిక స్థితి మెరుగుపడాలని, 2047 నాటికి తెలంగాణ ప్రపంచ స్థాయిలో 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందాలని పరమశివుడిని ప్రార్థించినట్లు తెలిపారు. శివరాత్రి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా శివాలయాలకు భారీ సంఖ్యలో వచ్చే భక్తుల కోసం ప్రభుత్వం అవసరమైన అన్ని సౌకర్యాలు, ఏర్పాట్లు చేపట్టిందన్నారు.

Read Also: ఎంపీటీసీ, జెడ్పీటీసీలోనూ పోటీ చేస్తాం : కవిత

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>