కలం, వెబ్ డెస్క్: నేడు సేవాలాల్ జయంతి (Sevalal Jayanti)ని పురస్కరించుకొని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బంజారాహిల్స్‌లోని సేవాలాల్ బంజారా భవన్లో ప్రత్యేక వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సేవాలాల్ మహారాజ్ విగ్రహానికి సీఎం రేవంత్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన పలు స్టాళ్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్, బంజారా సేవాలాల్ ప్రతినిధులు పాల్గొన్నారు.


