epaper
Wednesday, February 18, 2026
epaper

కోట్లాది మందికి ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలు : సీఎం చంద్రబాబు

కలం, డెస్క్ : ఎన్టీఆర్ ట్రస్ట్ ప్రారంభమై 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu) ప్రత్యేక అభినందనలు తెలిపారు. సీనియర్ ఎన్టీఆర్ సేవాభావంలో భాగంగానే ట్రస్ట్ సేవలు అందిస్తోందని చెప్పారు. ఇప్పటి వరకు కోట్లాది మందికి ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలు అందాయని.. విద్య, ఉపాధిలో కీలకంగా ట్రస్ట్ వ్యవహరిస్తోందని.. ట్రస్టీ నారా భువనేశ్వరి సేవలు ఎనలేనివి అంటూ ప్రశంసించారు సీఎం చంద్రబాబు (Chandrababu). సీనియర్ ఎన్టీఆర్ ఎప్పుడైనా ప్రజలే దేవుళ్లని భావించారు కాబట్టే.. ఆయన ఆలోచనలకు తగ్గట్టుగా ట్రస్ట్ సేవలు అందిస్తోందన్నారు. సమాజంలో ట్రస్ట్ సేవలతో చెరగని ముద్ర వేసిందంటూ చెప్పుకొచ్చారు.

తలసేమియా వ్యాధి గ్రస్తులకు ట్రస్ట్ సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని సీఎం చంద్రబాబు వెల్లడించారు. అంది వస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ సేవలు అందించడంలో ముందు ఉండాలని సూచించారు. విద్య, వైద్యం, రక్తదానం, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం లాంటివి ట్రస్ట్ సేవల్లో ప్రముఖ పాత్ర పోషిస్తాయని సీఎం చంద్రబాబు వివరించారు. నారా భువనేశ్వరి ఇలాగే సేవా స్ఫూర్తితో ముందుకు సాగాలని.. ట్రస్ట్ సేవలు మరింత మందికి చేరువ కావాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>