కలం, వెబ్ డెస్క్: టాలీవుడ్ యాక్టర్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy)ని ఆయన నివాసంలో కలిశారు. సీఎం రేవంత్‌తో విజయ్ దిగిన తాజా ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే సీఎంని ఎందుకు కలిశారన్నది విజయ్ బయటపెట్టలేదు. ఈ నెల 26న హీరోయిన్ రష్మికతో విజయ్ దేవరకొండ పెళ్లి జరుగనుందని కొద్ది రోజులుగా పుకార్లు నడుస్తున్నాయి. దీనిపై అటు రష్మిక, ఇటు విజయ్ ఎవరూ అధికారికంగా స్పందించలేదు. దీంతో తమ పెళ్లికి ఆహ్వానం అందించేందుకే విజయ్ సీఎం రేవంత్‌ను కలిశాడని అంతా చర్చించుకుంటున్నారు.
విజయ్, రష్మిక కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నట్లు సోషల్ మీడియాలో గుసగుసలు నడిచాయి. ప్రేమ విషయంపై పలు ఇంటర్వ్యూల్లో డైరెక్ట్‌గా ఇద్దరినీ ప్రశ్నించినా ఎప్పుడూ అది అబద్ధమని చెప్పలేదు. ఇటీవల బాలీవుడ్ మీడియాలో రష్మికను పెళ్లి గురించి అడిగినా సైలెంట్‌గా నవ్వేసి ఊరుకుంది. ఇప్పటికే వీరిద్దరి ఎంగేజ్‌మెంట్ కూడా అయిపోయినట్లు వార్తలొచ్చాయి. ఫిబ్రవరి 26న పెళ్లి, మార్చి 4న రిసెప్షన్ జరగనుందనే ప్రచారం జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డిని పెళ్లి లేదా రిసెప్షన్‌కు విజయ్ ఆహ్వానించినట్లు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.


