epaper
Monday, March 2, 2026
epaper

వరల్డ్ కప్‌లో నిఖత్ పసిడి పంచ్

ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్‌లో హైదరాబాదీ బాక్సర్ నిఖత్ జరీన్(Nikhat Zareen) అదరగొట్టింది. ఫైనల్స్‌లో విజయం సాధించి తన సత్తా చాటుకుంది. అద్భుత ఫామ్‌తో పసిడి పతకాన్ని సొంతం చేసుకుది. గురువారం జరిగిన మహిళల 51 కేజీల టైటిల్ పోరులో నిఖత్, చైనీస్ తైపీకి చెందిన గవో యీ గ్జువాన్‌ను 5-0 తేడాతో చిత్తుగా ఓడించింది.

మొదటి రౌండ్ నుంచే నిఖత్(Nikhat Zareen) అటాక్ మోడ్‌లోకి వెళ్లింది. పదునైన పంచ్‌లతో ప్రత్యర్థిని బెంబేలెత్తించింది. చివరి వరకు అదే ఫామ్‌తో పోరాడుతూ విజయం సాధించింది. వరల్డ్ ఛాంపియన్ షిప్‌లో క్వార్టర్ ఫైనల్లో ఓటమి పాలైన తర్వాత, మళ్ళీ ఇప్పుడు స్వర్ణం సాధించి తన సత్తా చాటుకుంది నిఖత్. నిఖత్‌తో పాటు భారత్ ఖాతాలో మరో 8 స్వర్ణ పతాలు చేరాయి.

భారత్‌కు వచ్చిన బంగారు పతకాలు ఇవే.

57 కేజీల వర్గంలో పారిస్ బ్రాంజ్ మెడలిస్ట్ వుయీపై జాస్మిన్ లాంబోరియా విజయం సాధించింది.

60 కేజీల్లో పర్వీన్ హుడా, జపాన్‌కు చెందిన తగుచి అయాకాను ఓడించింది.

80 కేజీల ఈవెంట్‌లో నుపుర్ షెరోన్, ఉజ్బెకిస్థాన్ బాక్సర్ సోటిమ్‌బొయేవాపై ఆధిపత్యం ప్రదర్శించింది.

70 కేజీల ఫైనల్లో అరుంధతి చౌదరి, అజీజాపై పైచేయి సాధించింది.

54 కేజీల్లో ప్రీతి పన్వర్, ఇటలీ బాక్సర్ సిరిన్‌ను ఓడించింది.

48 కేజీల వర్గంలో మీనాక్షి హుడా, ఉజ్బెకిస్థాన్‌కు చెందిన ఫోజిలివాను మట్టికరిపించింది.

Nikhat Zareen

పురుషుల విభాగంలో:

70 కేజీలలో హితేశ్ గులియా, కజకిస్థాన్ బాక్సర్ నార్‌బెక్‌ను ఓడించి బంగారు పతకం దక్కించుకున్నాడు.

60 కేజీల్లో సచిన్ సివాచ్, కిర్గిజిస్థాన్‌కు చెందిన మునార్‌బెక్‌పై గెలిచి స్వర్ణం సాధించాడు.

అదనంగా 5 మంది భారత బాక్సర్లు రజత పతకాలతో నిలిచారు —
జాదుమణి సింగ్ (50 కేజీ), అంకుశ్ (80 కేజీ), పవన్ (55 కేజీ), అబినాష్ (65 కేజీ), పూజ రాణి (80 కేజీ).

మొత్తం గణాంకాలు:

స్వర్ణాలు: 9

రజతాలు: 6

కాంస్యాలు: 5

మొత్తం 20 పతకాలు సాధించిన భారత్, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంతో టోర్నమెంట్‌ను ఘనంగా ముగించింది.

Read Also: ఇమ్మడి రవి రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు

Follow Us on: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!