కలం, సినిమా : సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu), క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) కాంబినేషన్‌లో తెరకెక్కిన బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ “1 నేనొక్కడినే” (1 Nenokkadine). 2014 సంక్రాంతి కానుకగా వచ్చిన ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. మహేశ్ కెరీర్‌లోనే ఈ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. డైరెక్టర్ సుకుమార్ 1 నేనొక్కడినే మూవీని హాలీవుడ్ స్థాయిలో, అదిరిపోయే టేకింగ్‌తో తెరకెక్కించాడు. ఆ రేంజ్‌లో తీసిన సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో మహేష్ కి హిట్ ఇవ్వలేకపోయాననే గిల్ట్ సుకుమార్ మనసులో ఉండిపోయిందట.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో మహేశ్ సినిమా ఫ్లాప్ అవ్వడానికి తానే కారణమేమో అని ఇప్పటికీ అనిపిస్తుందని సుకుమార్ అన్నారు. తన దగ్గర ఉన్న మరో వెర్షన్ లో కనుక సినిమా తెరకెక్కించి ఉంటే సినిమా రీచ్ మరోలా ఉండేదని అభిప్రాయపడ్డారు. సెకండ్ వెర్షన్‌లో హీరో ఇచ్చే పెద్ద ట్విస్ట్ సినిమాని మరో లెవెల్‌కి తీసుకెళ్ళేదని సుకుమార్ తెలిపారు. కానీ మొదటి వెర్షన్‌లో వచ్చే ఎమోషన్ పాడు చేయకూడదనే ఉద్దేశంతో ఆ వెర్షన్ తెరకెక్కించామని సుకుమార్ వెల్లడించారు.


