epaper
Wednesday, February 18, 2026
epaper

సోషల్​ మీడియాను బ్యాన్​ చేయాలి : నాగబాబు

కలం, వెబ్​ డెస్క్​ : 16 ఏళ్ల లోపు ఉన్న పిల్లలు సామాజిక మాధ్యమాలను వినియోగించకుండ కట్టడి (Social Media Ban) చేయాలని జనసేన ఎమ్మెల్సీ నాగబాబు (Naga Babu) అన్నారు. శుక్రవారం ఏపీ మండలిలో సోషల్​ మీడియా వల్ల జరుగుతున్న దుష్పరిణామాలపై మాట్లాడారు. సోషల్​ మీడియా కట్టడికి ప్రత్యేక చట్టాలు రూపొందించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. 16 సంవత్సరాల లోపున్న పిల్లలకు మంచిచెడుల మధ్య ఉన్న తేడాలను అర్థం చేసుకోలేరన్నారు. అస్ట్రేలియా, డెన్మార్క్​, ఫ్రాన్స్​, యూరప్​ దేశాల్లో 16ఏళ్ల లోపున్న పిల్లలు సోషల్​ మీడియా వాడకంపై బ్యాన్ విధించారని.. ఇక్కడ కూడా అలాంటి చర్యలు తీసుకోవాలని కోరారు.

ప్రాణాంతకమైన సోషల్​ మీడియా ఛాలెంజ్ లతో ఎంతో మంది పిల్లలు తనువు చాలించారని నాగబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, చిన్నారులు అనేక ఒత్తిళ్లు, మానసిక ఆందోళనకు గురవుతున్నారన్నారు. స్కూళ్లలో పిల్లలకు ఇచ్చే ట్యాబుల్లో సోషల్​ మీడియాకు సంబంధించిన యాప్​ లు వినియోగించరాకుండా చర్యలు (Social Media Ban)) తీసుకోవాలన్నారు. ఐటీ, పోలీస్​, విద్యాశాఖ సమన్వయం చేసుకుని సోషల్​ మీడియాలో జరుగుతున్న అరాచకాలను అడ్డుకట్ట వేయాలని సూచించారు. పాఠశాలల్లో పిల్లల తల్లిదండ్రులకు సోషల్​ మీడియా వల్ల వచ్చే అనర్థాలపై అవగాహన కల్పించాలని నాగబాబు కోరారు.

Read Also: బీజేపీ మంత్రికి చుక్కలు చూపించిన మహిళా ఎస్పీ.. అధికారిణిపై నెటిజన్ల ప్రశంసలు

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>