epaper
Wednesday, February 18, 2026
epaper

బీజేపీ మంత్రికి చుక్కలు చూపించిన మహిళా ఎస్పీ.. అధికారిణిపై నెటిజన్ల ప్రశంసలు

కలం, వెబ్ డెస్క్: హర్యానా (Haryana)లో బీజేపీ మంత్రికి, మహిళా ఐపీఎస్ అధికారిణి మధ్య జరిగిన వాగ్వాదం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భూ అక్రమాల కేసు విషయంలో ఓ పోలీస్ అధికారిని సస్పెండ్ చేయాలని హర్యానా ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్ (Minister Anil Vij) అక్కడే ఉన్న ఎస్పీ ఖైతల్ ఉపాసన (SP Kaithal Upasana) ని  ఆదేశించారు. ఆ అధికారిని సస్పెండ్ చేసే అధికారం తనకు లేదని, రూల్స్ ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని మహిళా ఎస్పీ ధైర్యంగా సమాధానమిచ్చారు.

తన ఆదేశాలను అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి, వెంటనే గది వదిలి బయటకు వెళ్లిపోవాలని ఎస్పీని ఆదేశించారు. ఏమాత్రం భయపడకుండా ఆమె దీటుగా బదులిచ్చారు. విధి నిర్వహణలో భాగంగానే ఇక్కడ ఉన్నానని తేల్చి చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మహిళా ఎస్పీపై నెటిజన్స్ ప్రశంసలు కురిపించారు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా ఆమె (SP Kaithal Upasana) వ్యవహరించిన తీరు ఎంతోమంది అధికారులకు స్ఫూర్తి అని ప్రశంసించారు.

Read Also: 27 వేల అడుగుల ఎత్తులో పేలిన విమాన ఇంజిన్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>