కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు బీజేపీ (BRS) ప్రత్యామ్నాయం అని ఆ పార్టీ చీఫ్ రాంచందర్ రావు (Ramchander Rao) అన్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై స్పందించిన ఆయన.. శుక్రవారం మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Elections) బీజేపీ ఓట్ల శాతం పెరిగింది అని చెప్పారు. కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ కుట్రలు చేయడంతో కొన్ని స్థానాల్లో ఓడిపోయామని చెప్పారు. అయినా, పార్టీకి రాష్ట్రంలో బలం పెరిగిందని.. బీఆర్ఎస్ (BRS) బలం తగ్గిందని తెలిపారు.
చాలా చోట్ల స్వల్ప తేడాతో ఓడిపోయామని.. కొత్తగూడెం, వైరాలో తొలిసారి విజయం సాధించామన్నారు. పోలీసులు, దౌర్జన్యాలు, అధికార దుర్వినియోగంతో కాంగ్రెస్ పార్టీ గెలిచిందని రాంచందర్ రావు ఆరోపించారు. హంగు ఏర్పడిన స్థానాల్లో ఏ పార్టీకి సపోర్ట్ చేయం అని స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో బీజేపీకి ఫలితాలు వచ్చాయని.. వచ్చిన రిజల్ట్స్ పై తాము సంతృప్తిగా ఉన్నామని ఆయన (Ramchander Rao) వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లోనూ ఇదే విధంగా బీజేపీ దూసుకెళ్తుందని ధీమా వ్యక్తం చేశారు.
Read Also: ప్రజా పాలనకు బ్రహ్మరథం : టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్
Follow Us On: Sharechat


