Mobile Popup Ad
Mobile Popup Ad

భోపాల్‌లో దారుణం.. మైనర్‌పై నాలుగు కార్లలో గ్యాంగ్ రేప్

కలం, వెబ్ డెస్క్: మహిళలు, అమ్మాయిల భద్రతకు ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు అమలుచేస్తున్నా అత్యాచారాలు ఆగడం లేదు. దేశంలో ఏదో ఒక చోట నిత్యం అత్యాచార ఘటన వెలుగుచూస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో భోపాల్‌ (Bhopal)లో 11వ తరగతి విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. పోలీసుల వివరాల ప్రకారం.. నిందితులు బాలికను నాలుగు వేర్వేరు కార్లలో తిప్పుతూ ఈ దారుణానికి ఒడిగట్టారు.

బాధితురాలిని బెదిరించి, బలవంతంగా మతం మార్చుకోవాలని ఒత్తిడి చేసినట్లు కూడా అభియోగాలు నమోదయ్యాయి. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న నిందితులపై సామూహిక అత్యాచారం, కిడ్నాప్, మధ్యప్రదేశ్ మత మార్పిడి చట్టం కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.

ఈ కేసులో పోలీసులు (Police) ఇప్పటికే ప్రధాన నిందితులను గుర్తించి విచారణ వేగవంతం చేశారు. నిందితులు బాధితురాలికి తెలిసినవారేనని, వారు పక్కా ప్రణాళికతోనే ఈ దారుణానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని, మహిళల భద్రత విషయంలో కచ్చితమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. బాధితురాలికి ప్రస్తుతం వైద్య సహాయం అందిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>