epaper
Wednesday, February 18, 2026
epaper

ప్రజా పాలనకు ప్రజలు పట్టం.. మున్సిపల్​ ఫలితాలపై భట్టి స్పందన

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించడంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ప్రజా పాలనకు ప్రజలు పట్టంకట్టారని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న నమ్మకం, విశ్వాసం ఈ ఎన్నికల్లో స్పష్టమైన ఆదరణగా మారిందని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలోకి బలంగా వెళ్లాయని ఆయన పేర్కొన్నారు. పార్టీ గెలుపే లక్ష్యంగా అహర్నిశలు శ్రమించిన కార్యకర్తలను, నాయకులను అభినందించారు. ఈ విజయం తమపై బాధ్యతను మరింత పెంచిందన్నారు.

కాగా తెలంగాణలో 116 మున్సిపాలిటీల్లోని ఫలితాలు ప్రకటించడానికి ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ప్రాథమిక ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. అనేక చోట్ల మెజారిటీ స్థానాలు కైవసం చేసుకుంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు వరుసగా గెలుస్తూ మంచి హవా చూపిస్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీ కొన్ని చోట్లా విజయం సాధించినప్పటికీ, కాంగ్రెస్ (Congress) అధిక స్థానాల్లో లీడ్ సాధిస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>