కలం,మెదక్ బ్యూరో: సిద్ధిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటిలో (Dubbaka Municipality) బీఆర్ఎస్ (BRS) పార్టీ దూసుకపోయింది. 20 వార్డులు ఉన్న దుబ్బాక మున్సిపల్ పీఠాన్ని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. దుబ్బాక మున్సిపాలిటి పరిధిలో మొత్తం వార్డులలో బీఆర్ఎస్ పార్టీ 11, కాంగ్రెస్ పార్టీ 4, బీజేపీ 2 , స్వతంత్రులు 2, ఫార్వర్డ్ బ్లాక్ 1 స్ధానాల్లో గెలిచారు.
చైర్మన్ పదవికి కావల్సిన మ్యాజిక్ ఫిగరు 11 సీట్లను గెలుచుకున్న బీఆర్ఎస్ (BRS) చైర్మన్ పీఠం ఎక్కనుంది. దుబ్బాక మున్సిపాలిటీ (Dubbaka Municipality) గెలవడానికి కాంగ్రెస్, బీజేపీ గట్టి ప్రయత్నాలు చేసిన స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి (Kotha Prabhakar Reddy) దుబ్బాక మున్సిపాలిటిని గెలిచి నియోజకవర్గంలో తన పట్టును నిలుపుకున్నారు.
Read Also: అభిషేక్ శర్మ అంతా గుడ్డి కొట్టుడే: పాక్ ప్లేయర్
Follow Us On : WhatsApp


