కలం, వెబ్ డెస్క్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో నవీన్ యాదవ్ (Naveen Yadav)ను ఓడించాలని బహిరంగంగా ప్రచారం చేసిన పాడి కౌశిక్ రెడ్డి (Kaushik Reddy) కి, ఆయన సొంత నియోజకవర్గమైన హుజురాబాద్ ప్రజలు గట్టి సమాధానం ఇచ్చారు. నవీన్ యాదవ్ విస్తృత ప్రచారం చేపట్టడంతో హుజూరాబాద్ మున్సిపాలిటీలో (Huzurabad Municipality) కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. హుజురాబాద్ మున్సిపల్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకోవడం స్థానిక రాజకీయాల్లో కీలక మలుపుగా భావిస్తున్నారు.
హుజురాబాద్ ఫలితాలు ఇలా ఉన్నాయి:
కాంగ్రెస్ (INC) – 16 స్థానాలు
బీఆర్ఎస్ (BRS) – 8 స్థానాలు
- బీజేపీ (BJP) – 5 స్థానాలు
ఈ ఫలితాలు హుజూరాబాద్ (Huzurabad) రాజకీయాల్లో మార్పుకు సంకేతాలుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకప్పుడు ఇక్కడ బలమైన స్థానం కలిగిన బీఆర్ఎస్‌కు ఈ ఫలితాలు ఎదురుదెబ్బగా మారగా, కాంగ్రెస్ (congress) శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.

Read Also: పట్టుబడినా.. పైచేయి సాధించారు
Follow Us On: Sharechat


