epaper
Wednesday, February 18, 2026
epaper

ప‌టాన్ చెరులో బీఆర్ఎస్ హ‌వా!

కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి జిల్లా ప‌టాన్ చెరు (Patancheru)  అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో జ‌రిగిన మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ పార్టీ జెట్‌ స్పీడ్‌తో దూసుకెళ్లింది. గ‌డ్డపోతారం, గుమ్మ‌డిద‌ల‌, ఇంద్రేశం మున్సిపాలిటీల్లో భారీ విజ‌యాలు సాధించింది. గ‌డ్డ‌పోతారం మున్సిపాలిటీలో 22 వార్డుల‌కుగాను బీఆర్ఎస్ 14, కాంగ్రెస్ 4, బీజేపీ 2, స్వ‌తంత్రులు ఒక్క‌రు విజ‌యం సాధించారు.

గుమ్మ‌డిద‌ల మున్సిపాలిటీలో 22 వార్డుల‌కు గాను బీఆర్ఎస్ 14, కాంగ్రెస్ 5, బీజేపీ 2, స్వ‌తంత్రులు ఒక్క‌రు విజ‌యం సాధించారు. ఇంద్రేశం మున్సిపాలిటీలో 18 వార్డుల‌కు గాను బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 6, బీజేపీ 2, స్వ‌తంత్రులు ఒక్క‌రు విజ‌యం సాధించారు. జిన్నారం, ఇస్నాపూర్ మున్సిపాలిటీలో సైతం అత్య‌ధిక వార్డులు గెలిచింది. ఇస్నాపూర్‌లో మొత్తం 26 వార్డులకుగాను బీఆర్ఎస్ 12, కాంగ్రెస్ 10, స్వ‌తంత్రులు 4 స్థానాల్లో గెలిచారు. ప‌టాన్ చెరు నియోజ‌క‌వ‌ర్గంలో కొత్త‌గా ఏర్పాటైన‌ ఈ ఐదు మున్సిపాలిటీల‌కు మొద‌టిసారి జరిగిన ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ సంపూర్ణ అధిప‌త్యం క‌న‌బ‌రిచింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>