epaper
Wednesday, February 18, 2026
epaper

సంగారెడ్డి, స‌దాశివ‌పేట‌లో జగ్గారెడ్డిదే పైచేయి!

కలం, మెదక్ బ్యూరో: ఎన్నో ఉద్రిక్త‌త‌లు, వివాదాల న‌డుమ జ‌రిగిన సంగారెడ్డి (Sangareddy), స‌దాశివ‌పేట (Sadasivapet) మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్(Congress) పార్టీ ఘ‌న‌ విజ‌యం సాధించింది. సంగారెడ్డి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ (BRS) పార్టీకి చెందిన చింతా ప్ర‌భాక‌ర్ ఉన్నా, మాజీ మంత్రి హ‌రీశ్‌ రావు ఈ రెండు మున్సిపాలిటీల్లో విస్తృతంగా ప్ర‌చారం చేసినా ఫ‌లితాలు మాత్రం కాంగ్రెస్‌కు అనుకూలంగా వ‌చ్చాయి. మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ కాంగ్రెస్ వ‌ర్కింగ్ ప్రెసిసెంట్ జ‌గ్గారెడ్డి (Jaggareddy) బీఆర్ఎస్ పార్టీపై పైచేయి సాధించారు.

జగ్గారెడ్డి (Jaggareddy) అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓట‌మిపాలైనా ఏదో ఓ కార్య‌క్ర‌మంలో జ‌నాల మ‌ధ్య ఉండ‌టం కాంగ్రెస్ పార్టీ విజ‌యానికి క‌లిసొచ్చింది. సంగారెడ్డి, సదాశివ‌పేట మున్సిపాలిటీల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా జ‌గ్గారెడ్డి భార్య, టీజేఐఐసీ చైర్మ‌న్ నిర్మ‌ల, కొడుకు, కూతురు.. ఇలా కుటుంబమంతా కాంగ్రెస్ అభ్య‌ర్థుల త‌ర‌ఫున ఇంటింటా ప్ర‌చారం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించి సంగారెడ్డిలో ఆధిప‌త్యం కొన‌సాగిద్దామ‌నుకున్న‌ ఎమ్మెల్యే చింతా ప్ర‌భాక‌ర్, మాజీ మంత్రి హ‌రీశ్‌ రావుకు చివ‌ర‌కు తీవ్ర నిరాశ మిగిలింది.

స‌దాశివ‌పేట‌ మున్సిపాలిటీ (Sadasivpet Municipality) ప‌రిధిలో మొత్తం 26 వార్డులు ఉండ‌గా కాంగ్రెస్ పార్టీ 16 , బీఆర్ఎస్ పార్టీ 8 , బీజేపీ 1, స్వ‌తంత్రులు ఒక్క‌ స్ధానంలో గెలిచారు. చైర్మ‌న్ ప‌దవికి కావాల్సిన మ్యాజిక్ ఫిగ‌ర్‌ మెజారీటీ సీట్లను గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ చైర్మ‌న్ పీఠం ఎక్క‌నుంది. సంగారెడ్డి మున్సిపాలిటీ (Sangareddy Municipality) పరిధిలో 38 వార్డులు ఉండగా ఇప్పటి వరకు ప్రకటించిన ఫలితాల్లో కాంగ్రెస్ 19 వార్డులు, బీఆర్ఎస్ 9, బీజేపీ 2, ఎంఐఎం 2 వార్డులు గెలిచారు. సంగారెడ్డి మున్సిపాలిటీలో కుడా ఎవరి మద్దతు అవసరం లేకుండా కాంగ్రెస్ చైర్మన్ అయ్యే అవకాశం ఉంది.

Read Also: గెలుపునకు పొంగిపోము.. ఓటమికి కుంగిపోము : వేముల

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>