epaper
Wednesday, February 18, 2026
epaper

మూడు మున్సిపాలిటీల్లో హంగ్.. అదృష్టం ఎవరికో..?

కలం, డెస్క్ : తెలంగాణలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) కౌంటింగ్ లో ఆసక్తికర ఫలితాలు కనిపిస్తున్నాయి. దేవరకద్ర, అలంపూర్, కేసముద్రంలో హంగ్ ఏర్పడింది. దేవరకద్రలో మొత్తం 12 వార్డులు ఉండగా.. కాంగ్రెస్ కు 6, బీఆర్ ఎస్ 6 సీట్లలో గెలిచాయి. దీంతో ఎవరికీ మెజార్టీ రాలేదు. అలంపూర్ లో 10 వార్డులు ఉంటే.. కాంగ్రెస్ కు ఐదు, బీఆర్ ఎస్ ఐదు స్థానాలు దక్కాయి. ఇక్కడ కూడా ఎవరికీ మెజార్టీ రాలేదు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మున్సిపాలిటీలో 16 స్థానాలుంటే.. 8 కాంగ్రెస్ కు, 8 బీఆర్ ఎస్ కు వచ్చాయి. దీంతో ఈ మూడు మున్సిపాలిటీల్లో పార్టీలు మంతనాలు మొదలు పెట్టాయి. అవతలి పార్టీ నుంచి ఎవరో ఒకరిని లాగేసుకోవాలని చాలానే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఎవరికీ మెజార్టీ రాకపోతే టాస్ వేసే ఛాన్స్ ఉందని అంటున్నారు అధికారులు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>