epaper
Wednesday, February 18, 2026
epaper

బంగ్లాదేశ్ నేష‌న‌ల్ పార్టీకి మోడీ అభినంద‌న‌లు

క‌లం, వెబ్ డెస్క్‌: బంగ్లాదేశ్‌ పార్లమెంటరీ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ (BNP) కచ్చితమైన విజయం సాధించే దిశ‌గా వెళ్తోంద‌ని పేర్కొంటూ తారీక్ రెహ‌మాన్‌ (Tarique Rahman)ను భారత‌ ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) అభినందించారు. ప్రధాని మోడీ ఎక్స్ వేదిక‌గా చేసిన పోస్టులో కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఈ విజయం బంగ్లాదేశ్ ప్రజలకు తారీక్ రెహ‌మాన్‌ నాయకత్వంపై ఉన్న విశ్వాసాన్ని చూపుతోంద‌ని పేర్కొన్నారు. భారత్ ఎల్ల‌వేళ‌లా ప్రజాస్వామ్య, ప్రగతిశీల, సమగ్ర బంగ్లాదేశ్‌కు మద్దతు ఇస్తుంద‌ని చెప్పారు. భార‌త్‌, బంగ్లాదేశ్‌ బహుముఖ సంబంధాలను మరింత బలపరచడానికి, సామాన్య అభివృద్ధి లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడానికి కలిసి పని చేయడానికి ఎదురు చూస్తున్నానంటూ మోడీ వెల్ల‌డించారు. ఈ పోస్టులో బంగ్లాదేశ్ నేష‌నల్ పార్టీ, తారీక్ రెహ‌మాన్ అధికారిక ఎక్స్‌ ఖాతాల‌ను కూడా ట్యాగ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>