కలం, వెబ్ డెస్క్: మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌లో లక్షెట్టిపేట మున్సిపాలిటీ ( Luxettipet Municipality) చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఇక్కడ పదో వార్డులో బీజేపీ అభ్యర్థి మృతి చెందగా.. మూడో వార్డులో ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద నెలకొన్న పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. బ్యాలెట్ బాక్సుల భద్రతపై అనుమానం వ్యక్తం చేస్తూ బీజేపీ (BJP), బీఆర్ఎస్ (BRS) అభ్యర్థులు కౌంటింగ్ కేంద్రాన్ని చుట్టుముట్టారు. మూడో వార్డు బ్యాలెట్ బాక్సుపై క్లాత్ ప్యాకింగ్ లేకపోవడంతో వివాదం తలెత్తింది. ఇది గమనించిన బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు కౌంటింగ్ సిబ్బంది, అధికారులతో వాగ్వాదానికి దిగారు. సీసీ ఫుటేజ్ పరిశీలించిన తర్వాతే కౌంటింగ్ ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు. అభ్యర్థులను సముదాయించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.


