కలం, వెబ్ డెస్క్: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush), హీరోయిన్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) త్వరలో వివాహం చేసుకోబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా వీరిద్దరూ ఒక్కటి కాబోతున్నారని నెట్టింట వార్తలు వైరల్ అయ్యాయి. వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తోందని, అందుకే రహస్యంగా పెళ్లి (Marriage)కి సిద్ధమయ్యారని అభిమానులు సోషల్ మీడియా వేదికగా చర్చించుకున్నారు.
ఈ వార్తలపై నటి మృణాల్ ఠాకూర్ క్లారిటీ ఇచ్చారు. తన పెళ్లి గురించి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆమె స్పష్టం చేశారు. ఫిబ్రవరి 14 నాకు ఏప్రిల్ ఫూల్స్ డే (ఏప్రిల్1) లాంటిది” అని పేర్కొంటూ రూమర్స్‌ను కొట్టిపారేశారు. ఈ వార్తలు ఎక్కడ మొదలయ్యాయో తనకు తెలియదని, తన గురించి అసత్య ప్రచారాలు రావడం షాకింగ్‌గా ఉందన్నారు. మృణాల్ ఇచ్చిన ఈ క్లారిటీతో ధనుష్‌తో ఆమె పెళ్లి అంటూ వస్తున్న వార్తలకు ప్రస్తుతానికి తెరపడినట్లయింది. మృణాల్ (Mrunal Thakur) ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.
Read Also: నాని ” ది ప్యారడైజ్ ” రిలీజ్ డేట్ ఫిక్స్
Follow Us On: Sharechat


