Mobile Popup Ad
Mobile Popup Ad

“ఉప్పెన” 5 ఏళ్లు పూర్తి.. బుచ్చిబాబు ఇంట్రెస్టింగ్ ట్వీట్

కలం, సినిమా : టాలీవుడ్ యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej) మొదటి సినిమా “ఉప్పెన” (Uppena)  5 ఏళ్లు పూర్తి చేసుకుంది. స్టార్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సనా (Buchibabu Sana) డైరెక్టర్‌గా మారి ఈ సినిమాను తెరకెక్కించారు. 2021 ఫిబ్రవరి 12న వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ అయిన ఈ అద్భుతమైన ప్రేమకథకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. సరికొత్త కథాంశంతో దర్శకుడు బుచ్చిబాబు ఈ సినిమాను ఎంతో అధ్భుతంగా తెరకెక్కించాడు. ఈ సినిమాలో క్యూట్ బ్యూటీ కృతి శెట్టి (Krithi Shetty) హీరోయిన్ గా నటించగా.. తమిళ్ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) హీరోయిన్ తండ్రి పాత్రలో నటించారు

ఈ సినిమాకు ఉన్న ప్రత్యేకత ఏమిటంటే.. దర్శకుడు, హీరో, హీరోయిన్ కు ఇదే మొదటి సినిమా కావడం విశేషం. ఈ సినిమాలో దేవిశ్రీ అందించిన మ్యూజిక్ సినిమాకే హైలెట్‌గా నిలిచింది. ఈ బ్లాక్ బస్టర్ మూవీ రిలీజ్ అయి 5ఏళ్లు కావడంతో దర్శకుడు  బుచ్చిబాబు (Buchibabu Sana) ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ఉప్పెన సినిమా కోసం పని చేసిన అందరికీ ధన్యవాదాలు.. మీ అందరి సపోర్ట్‌తోనే ఇతంటి అద్భుతమైన సినిమా తీయగలిగాను అంటూ మూవీ టీం మెంబర్స్ అందరిని  ట్యాగ్ చేశారు.

Read Also: పెళ్లి రూమర్లపై మృణాల్ సెటైర్లు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>