కలం, డెస్క్ : పెద్దపల్లి (Peddapalli) జిల్లాలో కల్తీఫుడ్ వల్ల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. జిల్లాలోని బాలసదన్ లో బుధవారం రాత్రి ఫుడ్ తిన్న తర్వాత 32 మంది స్టూడెంట్లు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. సంక్షేమ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే కల్తీ ఫుడ్ పెట్టారంటూ విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే అధికారులు మాత్రం రెగ్యులర్ చెకప్ లో భాగంగానే ఆస్పత్రికి తీసుకెళ్లామంటూ చెబుతున్నారు. కానీ స్టూడెంట్లు ఆస్పత్రి బెడ్ల మీద అవస్థ పడుతున్న వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read Also: క్యాంప్ పాలిటిక్స్.. పార్టీల కౌంటర్ స్ట్రాటెజీ
Follow Us On : WhatsApp


