epaper
Wednesday, February 18, 2026
epaper

మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద కొండ ముచ్చు ఫోటో

కలం, వెబ్ డెస్క్: సిరిసిల్ల (Sircilla) లోని సినారే కళామందిరంలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం అధికారులు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే.. ఆ ప్రాంతంలో కోతుల బెడద (Monkey Menace) ఎక్కువగా ఉంది. చెట్లపై గుంపులుగా తిరిగే కోతులు ఎప్పుడైనా లోపలికి దూసుకువచ్చే ప్రమాదం ఉంది. లెక్కింపు సమయంలో గందరగోళం ఏర్పడకూడదని అధికారులు వినూత్న ఆలోచన చేశారు.

సాధారణంగా కోతులు కొండముచ్చులను చూసి భయపడతాయి. కోతుల బెడద ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో మున్సిపాలిటీ వారు కొండముచ్చు (Baboon) ను తిప్పుతారు. ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద కూడా కోతుల బెడద ఎక్కువగా ఉండటంతో  వాటిని భయపెట్టేందుకు అధికారులు కొండముచ్చు ఫోటోను ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. ఈ చిన్న ప్రయత్నం అందరికీ చిరునవ్వు తెప్పించింది.

Read Also: రూ. 2200 కోట్ల ఆస్తిని కాపాడిన హైడ్రా

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>