కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ నగరంలో నకిలీ ఇన్‌వాయిస్‌లతో జరుగుతున్న భారీ మోసం (Fake Invoice Scam) వెలుగులోకి వచ్చింది. సుమారు 32 కోట్ల రూపాయల మేర ప్రభుత్వానికి గండి కొట్టిన ఈ గుట్టును సంబంధిత అధికారులు రట్టు చేశారు. ఒక ప్రముఖ కంపెనీ పేరుతో భారీగా సరుకులు తరలిస్తున్నట్లు తప్పుడు పత్రాలను సృష్టించి, ఒకే వాహనం నంబర్‌తో పదేపదే నకిలీ బిల్లులు, ఇన్‌వాయిస్‌లు తయారు చేసినట్లు విచారణలో తేలింది.
నిజానికి ఎటువంటి వస్తువులు రవాణా చేయకుండానే, సుమారు 72 కోట్ల రూపాయల విలువైన వస్తువులు చేరవేసినట్లు చూపిస్తూ ఈ నకిలీ పత్రాలను (Fake Invoice Scam) సృష్టించారు. తనిఖీల సమయంలో వాహన పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించడంతో ఈ కుంభకోణం బయటపడింది. అసలు సరుకులు స్వీకరించకుండానే తప్పుడు ఇన్‌వాయిస్‌ల ద్వారా ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్స్ పొందేందుకు ఈ మోసానికి పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఉదంతంపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: KCR పాలనపై మరోసారి కవిత సంచలన కామెంట్స్
Follow Us On: Sharechat


