కలం, నల్లగొండ బ్యూరో: సూర్యాపేట (Suryapet) లో రాజకీయం రసవత్తరంగా మారింది. శుక్రవారం మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి (Jagadish Reddy) సూర్యాపేట మున్సిపల్ బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థులను క్యాంపునకు తరలించారు. జగదీశ్ రెడ్డితో పాటు 48 మంది కౌన్సిలర్లు అభ్యర్థులు క్యాంపులో ఉన్నారు. బుధవారం 44 మంది కౌన్సిలర్ అభ్యర్ధులు.. గురువారం మరో నలుగురు అభ్యర్థులు క్యాంపులో చేరారు. ముందస్తుగా కౌంటింగ్ ఏజెంట్ల ప్రక్రియను పూర్తి చేసింది.
16వ తేదీ ఉదయం నేరుగా చైర్మన్ ఎన్నిక సమయంలో సూర్యాపేట కు వచ్చే విధంగా ప్లాన్ చేశారు. ఇదిలాఉంటే.. సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ వార్డులను కైవసం చేసుకుంటామని బీఆర్ఎస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో సూర్యాపేట మున్సిపల్ పీఠంపై ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ జండా ఎగరాలని జగదీష్ రెడ్డి పట్టుబట్టారు. ఇదే సమయంలో కాంగ్రెస్ శ్రేణులు సైతం సూర్యాపేట మున్సిపాలిటీ (Suryapet Municipality) తమ ఖాతా వేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థులను అధికార కాంగ్రెస్ పార్టీ ప్రలోభ పెడుతుందనే ఉద్దేశంతో క్యాంపు రాజకీయాలకు తెరలేపారు.
Read Also: ఇయర్ఫోన్ లేకుండా వింటున్నారా?.. అయితే శిక్ష తప్పదు
Follow Us On: Sharechat


