దేశ రాజకీయాల్లో SIR సంచలన చర్చలకు దారితీస్తోంది. ప్రతిపక్షాలన్నీ దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా దీనిపై కర్ణాటక మంత్రి సంతోష్ లాడ్(Santosh Lad) కీలక వ్యాఖ్యలు చేశారు. భారత ఎన్నికల విధానంపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందన్నారు.
“ఈరోజు ప్రజాస్వామ్య దేశంలో నిరంకుశ పాలన చూస్తున్నాము. ప్రతి ఎన్నికలో మోదీ(Modi) సాహెబ్ మరియు ఎన్నికల సంఘం(EC) ఈ విధంగా పనిచేస్తున్నాయి… ఎల్లప్పుడూ బీజేపీ గెలిచేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 25 సంవత్సరాలు పాలించిన ఏ పార్టీకి అయినా ఆంటీ–ఇంకంబెన్సీ ఉంటుంది. అయితే 100 సీట్లు పోటీ చేసి 95 సీట్లు గెలవడం అంటే ఎన్నికల్లో మోసం జరిగినట్టే” అని వ్యాఖ్యానించారు. లాడ్(Santosh Lad) చేసిన ఈ విమర్శలు కర్ణాటక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
Read Also: బిహార్‌లో గెలిచేదాకా కొట్లాడతా.. వ్యూహకర్త డ్యూటీకి గుడ్ బై : ప్రశాంత్ కిషోర్
Follow Us on : Pinterest

