కలం, మెదక్ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను (Labour Codes) తీవ్రంగా వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా అఖిల భారత కార్మిక సంఘాలు సమ్మె చేపట్టాయి. ఇందులో భాగంగా సంగారెడ్డి జిల్లాలోని పటాన్‌చెరు ప్రాంతంలోని పారిశ్రామిక వాడల్లో కార్మికులు బంద్ (Bharat Bandh) లో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. కార్మిక సంఘాల పిలుపు మేరకు కార్మికులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని, హైర్ అండ్ ఫైర్ విధానాన్ని ఉపసంహరించాలని కార్మికులు డిమాండ్ చేశారు.
4 లేబర్ కోడ్లు రద్దు, ఉద్యోగ భద్రత, 8 గంటల పని దినం అమలు చేయాలంటూ నినాదాలు చేస్తూ ర్యాలీలు నిర్వహించారు. అదనంగా విద్యుత్ సవరణ బిల్లు 2025ను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ పరిశ్రమలను పరిరక్షించాలని, కనీస వేతనాలను పెంచాలని, ఉద్యోగ-ఉపాధి భద్రత కల్పించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ బంద్ (Bharat Bandh) లో CITU, AITUC, INTUC తదితర కేంద్ర కార్మిక సంఘాలు చురుకుగా పాల్గొన్నాయి.
Read Also: ఆస్తి లాక్కోని అనాథను చేశారు.. కన్నతండ్రిపై కన్నకూతుళ్ల కర్కషత్వం
Follow Us On: Sharechat


