కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో హైదరాబాద్‌లో చేపట్టనున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టు గురించి సీఎం వివరించారు. ఫిబ్రవరి చివరి వారంలో గాంధీ సరోవర్ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హాజరు కావాలని ఆహ్వానించారు. ఈసా, మూసీ నదుల సంగమ స్థలంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వివరించారు.1948 ఫిబ్రవరిలో మహాత్మా గాంధీజీ చితభస్మాన్ని ఈసా-మూసీ సంగమ స్థలంలో నిమజ్జనం చేశారని, ఆ చారిత్రక ప్రాముఖ్యతను కేంద్ర మంత్రికి తెలియజేసిన రేవంత్ రెడ్డి .
మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టులో (Musi Rejuvenation) భాగంగా గాంధీ సరోవర్‌ను అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. బాపూఘాట్‌ను ప్రపంచ స్థాయి విద్యా, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, పర్యావరణ చిహ్నంగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. గాంధేయ విలువలు, జాతీయ సమైక్యతను ప్రతిబింబించేలా ఈ ప్రాజెక్టు రూపొందుతుందని వివరించారు. ఈ భేటీలో గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు అవసరమైన రక్షణ శాఖ భూముల బదలాయింపు విషయంపై కూడా చర్చ జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఈ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసేందుకు కేంద్ర సహకారం కోరారు. సీఎం వెంట ఎంపీలు కడియం కావ్య, అనిల్ కుమార్ యాదవ్, గడ్డం వంశీ కృష్ణ, మల్లు రవి ఉన్నారు.
Read Also: రూ.3.25లక్షల కోట్లతో 114 రఫేల్ జెట్స్.. సెంటర్ ఓకే
Follow Us On: Youtube


