కలం, వెబ్ డెస్క్ : ఫిబ్రవరి నెలా అంటే ముందుగా గుర్తుకు వచ్చేది వాలంటైన్స్ డే (Valentines Day). ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేమికుల రోజును ఘనంగా నిర్వహించుకునేందుకు లవర్స్ రెడీ అవుతున్నారు. అయితే, భారతదేశంలో కొన్ని వర్గాలు వాలంటైన్స్ డేను వ్యతిరేకిస్తున్నారు. ఇది పాశ్చాత్య సంస్కృతిని ప్రోత్సహించే విధంగా ఉందంటూ, భారతీయ ఆచార వ్యవహారాలు, సనాతన దర్మానికి వాలంటైన్స్ డే జరుపుకోవడం విరుద్దమని కొన్ని హిందూ సంఘాలు వాదిస్తున్నాయి. దీంతో దేశంలో ప్రేమికుల రోజు జరుపుకోకుండా.. పార్కులు, రెస్టారెంట్ల దగ్గర బజరంగ్ దళ్(Bajrang Dal), విశ్వహిందూ పరిషత్ (VHP), హిందూ మహాసభ, ఆర్ఎస్ఎస్ (RSS) లాంటి తదితర సంస్థలు దృష్టి పెడుతున్నాయి.
ప్రేమికుల దినోత్సవం (Valentines Day) ముందు ఉత్తరప్రదేశ్ కు చెందిన క్రాంతిసేన లవర్స్ కు వార్నింగ్ ఇస్తోంది. వాలంటైన్స్ డే జరుపుకోకూడదు అంటూ ముజాఫర్ నగర్ లో కరపత్రాలు పంచుతూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. ప్రేమికులు కనిపిస్తే వారి ఎముకలు విరిచేస్తాం అని లాఠీలకు నూనే రాస్తు హెచ్చరించిన క్రాంతి సేన సభ్యులు. ఈ హెచ్చరికల నేపథ్యంలో యూపీలో ప్రేమికుల దినోత్సవరం జరుపుకోవడం కష్టంగా మారిందనే చెప్పాలి.
Read Also: ఆస్తి లాక్కోని అనాథను చేశారు.. కన్నతండ్రిపై కన్నకూతుళ్ల కర్కషత్వం
Follow Us On: Sharechat


