కలం, వెబ్ డెస్క్: రోవన్ అట్కిన్సన్ (Rowan Atkinson) అంటే పెద్దగా గుర్తుకు రాకపోవచ్చు. అదేనండి మన ‘మిస్టర్ బీన్’ (Mr Bean) యాక్టర్. తాజాగా లాస్ ఏంజెలెస్‌లో నిర్వహించిన ఒక అవార్డ్ ఫంక్షన్‌లో సంచలన ప్రకటన చేశాడు. స్టేజిపై అతడు మాట్లాడుతుంటే ఆడిటోరియం అంతా మూగబోయింది. స్టార్స్, ప్రొడ్యూసర్స్ అంతా కూడా మౌనంగా చూస్తూ ఉండటం తప్ప మరేం చేయలేక పోయారు. రోవన్ ఒక్కో పదం ఒక్కో బులెట్‌లా అనిపించిందని సోషల్ మీడియాలో కూడా చర్చ హోరుమంటోంది.
డిసెంబర్ 20న జరిగిన ఈ వైభవమైన కార్యక్రమానికి ఫిల్మ్ మొగల్స్, టెక్ బిలియనీర్స్, ప్రముఖ నటీనటులు హాజరయ్యారు. అదే వేదికపై రోవన్ అట్కిన్సన్‌కు (Rowan Atkinson) లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందించారు. సాధారణంగా కృతజ్ఞతలు చెప్పాల్సిన సమయంలో ఆయన భిన్నంగా స్పందించారు. అవార్డు సంస్థకు ధన్యవాదాలు చెప్పకుండా, ప్రపంచ పరిస్థితులపై తన ఆలోచనలను పంచుకున్నారు. సంపద, కీర్తి మధ్య కూర్చుని బయట ప్రపంచంలో జరుగుతున్న కష్టాలను పట్టించుకోకపోతే మార్పు కాదని, అది కేవలం గోల మాత్రమేనని ఆయన పేర్కొన్నారు.
అలాగే అవసరానికి మించి ఉన్న సంపద మీ సొంతం కాదని, తక్కువ స్థాయిలో ఉన్న వారి ఎదుగుదల కోసం దానిని వినియోగించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన తెలిపారు. అతడు చెప్పిన ఈ మాటలతో ఆ ఆడిటోరియం అంతా పిన్‌డ్రాప్ సైలెంట్ అయిపోయింది. అక్కడున్న సినీ పెద్దలు, అతిథులు అంతా కూడా చిన్న కదలికయినా లేకుండా అలానే కూర్చుండిపోయారు.
రోవల్ మాటలు చెప్పి వదిలేయలేదు.. తన స్పీచ్ తర్వాత అదే రాత్రి కీలక ప్రకటన కూడా చేశారు. తనకు ఇప్పటికే చేసిన పెట్టుబడుల నుంచి, రాబోయే క్రియేటివ్ ప్రాజెక్టుల నుంచి వచ్చే మొత్తం లాభాన్ని. అంటూ సుమారు 160 మిలియన్ అమెరికన్ డాలర్లను పిల్లల ఆరోగ్య కార్యక్రమాలు, ఎన్విరాన్‌మెంట్ సేఫ్టీ ప్రాజెక్ట్‌లు, పేద విద్యార్థుల కళ విద్యకు విరాళంగా ఇవ్వనున్నట్టు వెల్లడించారు.
ఆయన దృష్టిలో వారసత్వం సంపాదనతో కాదు, దానం ద్వారా నిర్మితమవుతుందని స్పష్టం చేశారు. సెలబ్రిటీలు కేవలం ప్రతీకలుగా మిగిలిపోయే ఈ కాలంలో, ఇతరుల బాధను తగ్గించడమే నిజమైన ప్రభావమని రోవన్ అట్కిన్సన్ తన చర్యలతో గుర్తు చేశారు. ఈ పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీస్తుండగా, ఆయన నిర్ణయం అనేక మందికి ప్రేరణగా మారుతోంది.
Read Also: పార్లమెంట్లో రచ్చరచ్చ.. పొట్టుపొట్టు కొట్టుకున్న నేతలు.. వీడియో వైరల్
Follow Us On: Youtube


