కలం, నల్లగొండ బ్యూరో: కాంగ్రెస్‌కు ఇవే చివరి ఎన్నికలు.. అందుకే దుర్మార్గంగా ప్రవర్తిస్తోందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి(Jagadish Reddy) విమర్శించారు. మిర్యాలగూడ (Miryalaguda) మున్సిపల్ ఎన్నికల హింస ఘటనలో గాయపడిన బీఆర్ఎస్ (BRS) కార్యకర్తలను నల్లగొండ ఐకాన్ హాస్పిటల్‌లో పరామర్శించి మాట్లాడారు. కాంగ్రెస్ (Congress) పతనం మొదలైందనేందుకు ఈ దాడులే నిదర్శనమన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కాంగ్రెస్‌లో ఫ్రస్టేషన్ పెరిగిపోతుందని, మిర్యాలగూడలో కాంగ్రెస్ తప్పిదాలను కవర్ చేసుకునేందుకే దాడులు చేస్తున్నారని తెలిపారు. నల్గొండ, మిర్యాలగూడ, సూర్యాపేటలో ఇదే తరహా ప్రయత్నాలు చేశారని, బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రతిఘటించడంతో ఉద్రిక్తత చోటుచేసుకుందన్నారు.
పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలుగా మారారని, జిల్లా అధికారులు నిస్సహాయ స్థితిలో ఉన్నారని చెప్పారు. ఎన్నికల సంఘం తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ బ్రాంచ్‌లా వ్యవహరిస్తోందని, ఇతర పార్టీల ఫిర్యాదులపై స్పందించడం లేదన్నారు. కాంగ్రెస్ నేతలు బూత్‌ల అక్రమణకు ప్రయత్నించినా అధికారులు పట్టించుకోలేదని, డబ్బు, అధికారం విచ్చలవిడిగా దుర్వినియోగం చివరకు భౌతిక దాడులకు పాల్పడి అరాచకాలకు తెరలేపారని ఆయన (Jagadish Reddy) ఆరోపించారు.
Read Also: మక్తల్ బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య కేసులో ట్విస్ట్..!
Follow Us On: Youtube


