epaper
Wednesday, February 18, 2026
epaper

రాహుల్​ రాగానే ఇంటర్వ్యూ ఆపేసిన కేంద్ర మంత్రులు ​

కలం, వెబ్​డెస్క్: పార్లమెంట్​ ఆవరణలో బుధవారం సరదా సంఘటన చోటుచేసుకుంది. కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు ప్రహ్లాద్​ జోషి, అశ్విని వైష్ణవ్​ ఇంటర్వ్యూలో మాట్లాడుతుండగా లోక్​సభలో విపక్ష నేత, కాంగ్రెస్​ ఎంపీ రాహుల్​ గాంధీ అటుగా వచ్చారు (Rahul Gandhi). ఆయన వెంట చెల్లెలు, ఎంపీ ప్రియాంక గాంధీతోపాటు మరికొందరు కాంగ్రెస్​ ఎంపీలు ఉన్నారు. ఏదో విషయమై మీడియాతో మాట్లాడుతున్న మంత్రులు.. రాహుల్​ తన బృందంతో అక్కడికి రాగానే ఆపేశారు.అంతేకాదు, అక్కడి నుంచి వెళ్లిపోయారు.

వాళ్లను ఆగమంటూ రాహుల్​ ఆపే ప్రయత్నం చేశారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్​ జోషీ చేయి పట్టుకొని వెనక్కి లాగుతూ ‘అందరం కలిసే మీడియాతో మాట్లాడదాం’ అంటూ పిలిచారు. దానికి నిరాకరించిన జోషి ‘నువ్వే మాట్లాడుకో’ అని సైగ చేస్తూ, అశ్విని వైష్ణవ్​ వెనకాలే అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో రాహుల్​ వెంట ఉన్న కాంగ్రెస్ ఎంపీల బృందం నవ్వులు చిందించింది (Rahul Gandhi). కాగా, ఈ వీడియో సోషల్​ మీడియాలో వైరల్​ అయ్యింది. దీనిపై కాంగ్రెస్​, బీజేపీ అభిమానులు కామెంట్లతో పరస్పరం తలపడుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>