కలం, వెబ్ డెస్క్ : టెక్నాలజీతో ఆటలు ఆడుకోవడం.. వాటిని చిత్రవిచిత్రాలకు ఉపయోగించడం మనం చూసి ఉంటాం. రోబోలను అనేక రంగాలలో ఉపయోగిస్తూ వాటి ద్వారా లాభాలు పొందుతున్నారు. అయితే, కేరళలో ఓ వ్యక్తి రోబోను ఉపయోగించి చేసిన పని (Begging Robot) ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓ వ్యక్తి హ్యూమనాయిడ్ రోబో ను కస్టమైజ్ చేయించుకున్నాడు. బిచ్చం ఎత్తుకునేలా దానికి ప్రోగ్రామ్ చేశాడు. సాధారణ బిచ్చగాళ్లలాగే ఆ రోబో చేతులు చాచి డబ్బుల కోసం అడుగుతుండడం వీడియోలో చూడొచ్చు. దీనిపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం రోబోకు బిచ్చగాడిలా ప్రోగ్రామ్ ఎథికల్ సరైందేనా అని ప్రశ్నిస్తున్నారు.
India has got its first unemployed begging robot 😇
After human employment, We are already testing Robot Unemployment. pic.twitter.com/wVA9bpcaDz— Woke Eminent (@WokePandemic) February 10, 2026


