కలం, స్పోర్ట్స్ : పాకిస్థాన్‌తో వరల్డ్ కప్ మ్యాచ్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) ఆస్పత్రిలో చేరాడు. దీంతో నమీబియా మ్యాచ్‌కు కూడా అతడు దూరం కావచ్చని సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. స్టమక్ ఇన్ఫెక్షన్‌తో గత రెండు రోజులుగా ఢిల్లీలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. పరీక్షలు కొనసాగుతున్నాయి. మ్యాచ్‌కు అందుబాటులో ఉంటారా అన్నది స్పష్టత లేకపోయిందని బీసీసీఐ (BCCI) వర్గాలు వెల్లడించాయి. యూఎస్ఏపై తొలి మ్యాచ్‌లోనే ఆయన అస్వస్థత కనిపించింది. తొలి బంతికే ఔట్ అయిన అభిషేక్ ఫీల్డింగ్‌కు రాలేదు. అప్పుడే కడుపు సమస్య ఉందని అసిస్టెంట్ కోచ్ తెలిపినట్లు సమాచారం.
అభిషేక్ (Abhishek Sharma) ఆడలేకపోతే టాప్ ఆర్డర్‌లో మార్పులు తప్పవు. సంజూ శాంసన్ ఓపెనర్‌గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. తుది నిర్ణయం ఫిట్‌నెస్‌పై ఆధారపడుతుందని జట్టు వర్గాలు సంకేతాలు ఇచ్చాయి. ఇక బుమ్రా రీఎంట్రీకి సిద్ధంగా ఉన్నారు. యూఎస్ఏ మ్యాచ్ మిస్ చేసిన ఆయన ఢిల్లీలో పూర్తి స్థాయి ప్రాక్టీస్ చేశారు. నమీబియాపై ఆడే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాషింగ్టన్ సుందర్ కూడా గాయం నుంచి కోలుకుని నెట్స్‌లో బౌలింగ్ చేశారు. మ్యాచ్ ఫిట్‌నెస్‌కు దగ్గరయ్యారు. నమీబియా (Namibia) మ్యాచ్‌కు ముందు జట్టులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. తుది జట్టు ఎలా ఉంటుందో ఆసక్తిగా మారింది.
Read Also: భారత్ బంద్.. మద్ధతు తెలిపిన కాంగ్రెస్
Follow Us On : WhatsApp


