epaper
Wednesday, February 18, 2026
epaper

పాక్‌తో మ్యాచ్ భారత్‌కు పరీక్షే: ర్యాన్ టెన్

కలం, వెబ్ డెస్క్ : కొలంబొ (Colombo) వేదికగా జరగనున్న భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌ పై టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డూషేక్ (Ryan ten Doeschate) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాక్ ను ఎదుర్కోవడం భారత్‌(India) కు అంత ఈజీ కాదన్నారు. ఈ సందర్భంగా పాకిస్థాన్ (Pakistan) బాయ్‌కాట్ వివాదంపై కూడా స్పందిస్తూ.. మ్యాచ్ రద్దవుతుందని తాము ఎప్పుడూ అనుకోలేదని పేర్కొన్నట్లు తెలిపారు. చర్చల తర్వాత పోరు జరుగుతుందని ముందే భావించాము.

షెడ్యూల్ మార్పు, తమ సన్నాహాల్లో ఎలాంటి తేడా చేయలేదని సూచించారు. పాకిస్థాన్ లాంటి బలమైన జట్టుతో గ్రూప్ దశలోనే ఆడటం జట్టుకు ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. కొలంబోలో గత రెండు వారాలుగా పాక్ జట్టు ఉన్నందున సవాల్ తేలికగా ఉండదని తెలిపారు. రాజకీయ అంశాలపై కాకుండా క్రికెట్‌పైనే దృష్టి పెట్టామని డూషేక్ (Ryan ten Doeschate) పేర్కొన్నారు.

ఫిబ్రవరి 15న ఆర్ ప్రేమదాసా స్టేడియంలో ఈ పోరు జరగనుంది. అంతకుముందు ఫిబ్రవరి 12న న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నమీబియాతో భారత్ ఆడనుంది. అభిషేక్ శర్మ కడుపు ఇన్ఫెక్షన్‌తో ఆస్పత్రిలో ఉన్నందున నమీబియా మ్యాచ్‌లో కనిపించే అవకాశం తక్కువగా ఉంది. అయితే కొలంబో పోరుకు ముందు కోలుకునే అవకాశం ఉందని జట్టు వర్గాలు భావిస్తున్నాయి. గ్రూప్-ఏలో కీలకమైన ఈ మ్యాచ్‌పై రెండు జట్ల సన్నాహాలు ముమ్మరం చేశాయి. మైదానంలో పోరు ఎలా మలుపు తిరుగుతుందో చూడాలి.

 Read Also: పీసీబీ కఠిన వైఖరికే ఐసీసీ తలొంచింది: సెథీ

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>