కలం, డెస్క్ : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పోలింగ్ లో (Municipal Polls) షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. 15వ వార్డుకు చెందిన పారిజాతం ఓటు వేయడానికి పోలింగ్ బూత్ కు వెళ్లగా.. ఆల్రెడీ నీ ఓటు పోల్ అయినట్టు అధికారులు చెప్పారు. దీంతో పారిజాతం బయటకు వచ్చి ఆందోళన వ్యక్తం చేసింది. తన పర్మిషన్ లేకుండా తన ఓటు వేరే వాళ్లు ఎలా వేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలింగ్ ఏజెంట్లు కూడా తనను గుర్తు పడతారని.. కానీ వేరే వాళ్లు వచ్చి ఓటు వేసి వెళ్లిపోతుంటే ఎందుకు అడ్డు చెప్పలేదంటూ ప్రశ్నించింది పారిజాతం. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దొంగ ఓట్లు వేశారేమో అంటూ ఆరోపణలు వస్తున్నాయి.
Read Also: పాపం వృద్ధురాలు.. ఓటు వేయించుకున్నారు వదిలేశారు
Follow Us On : WhatsApp


