epaper
Wednesday, February 18, 2026
epaper

ఇండియాపై అటాకింగ్ ఫార్ములానే : సాహిబ్‌జాదా ఫర్హాన్

కలం, వెబ్ డెస్క్ : ఫిబ్రవరి 15న భారత్‌తో తలపడటానికి పాకిస్థాన్ జట్టు సన్నద్ధం అవుతోంది. భారత్‌ను మట్టికరిపించడానికి తమ వ్యూహాలకు పదునుపెడుతోంది. ఈ క్రమంలోనే ఇండియాపై తమ ఆటతీరు ఎలా ఉంటుందన్న అంశంపై పాక్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్ (Sahibzada Farhan) చెప్పాడు. భారత్‌ (India)తో జరిగే మ్యాచ్‌లో తమ జట్టు ఫుల్ అటాక్ మోడ్‌లో ఆడనుందన్నాడు. మైదానంలోకి అడుగుపెట్టిన క్షణం నుంచి అటాక్ మోడ్‌లోకి వెళ్తామని వివరించాడు. కొన్ని రోజుల ముందు వరకు భారత్‌తో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయనున్నట్లు పాకిస్థాన్ (Pakistan) వెల్లడించింది. రాజకీయ, పరిపాలనా కారణాల వల్లే ఆ ప్రకటన చేసింది. కాగా ఐసీసీ, పీసీబీ, పాకిస్థాన్ ప్రభుత్వం మధ్య చర్చల తర్వాత ఆ నిర్ణయం వెనక్కి తీసుకున్నారు. మ్యాచ్‌కు మార్గం సుగమమైంది.

అయితే మంగళవారం పాకిస్థాన్ జట్టు యూఎస్ఏతో తలపడింది. ఆ మ్యాచ్‌లో యూఎస్ఏపై పాక్ సాధించిన 32 పరుగుల విజయంలో ఫర్హాన్ 41 బంతుల్లో 73 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అయ్యాడు. అనంతరం జట్టు ధోరణి గురించి ఫర్హాన్ (Sahibzada Farhan) స్పష్టం చేశాడు. గతంలో ఇండియాపై ఆడినట్లే ఈసారి కూడా సానుకూల, దూకుడు ఆటనే కొనసాగిస్తామని వెల్లడించాడు. మ్యాచ్‌కు ముందు నుంచే తాను ఆత్మవిశ్వాసంతో ఉన్నానని తెలిపాడు.

నెట్ సెషన్‌లో బంతి బాగా బ్యాట్‌కు వస్తోందని బ్యాటింగ్ కోచ్ హనీఫ్ మాలిక్‌కు చెప్పినట్లు పేర్కొన్నాడు. మ్యాచ్‌ను ముగించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవుతానని కూడా ముందే చెప్పానని వెల్లడించాడు. ఈ వరల్డ్ కప్‌(World Cup) లో కనీసం రెండు నుంచి మూడు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలవాలనే వ్యక్తిగత లక్ష్యం పెట్టుకున్నానని సూచించాడు. గ్రూప్ దశలో కీలకమైన ఈ మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్ శిబిరం ఉత్సాహంగా ఉంది. కొలంబో వేదికగా జరిగే పోరులో రెండు జట్ల ప్రదర్శనపై ఆసక్తి నెలకొంది.

 Read Also: ఈరోజే జీవితంలో తొలిసారి కెమెరా ముందు నిలబడ్డా : చిరంజీవి

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>