Mobile Popup Ad
Mobile Popup Ad

పుంజుకుంటున్న పోలింగ్ .. మధ్యాహ్నం వరకు ఎంతంటే..

కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ (Municipal Polling) క్రమంగా పుంజుకుంటున్నది. ఉదయం కాస్త మందకొడిగా సాగిన పోలింగ్.. మధ్యాహ్నం సమయానికి భారీగా పుంజుకున్నది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 48.54 శాతం పోలింగ్ నమోదైంది. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మున్సిపల్ కార్పొరేషన్లలో సగటున 40.96 శాతం ఓటింగ్ నమోదైంది. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్‌లో (Kothagudem Corporation) అత్యధికంగా 53.48 శాతం, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో అత్యల్పంగా 35.49 శాతం మాత్రమే ఓటింగ్ జరిగింది.

ఆలంపూర్ జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీ (Waddepalle Municipality) అత్యధికంగా 68.57 శాతం పోలింగ్‌ నమోదైంది. నిర్మల్ మున్సిపాలిటీలో అత్యల్పంగా 33.73 శాతం పోలింగ్ (Municipal Polling) మాత్రమే నమోదైంది. మధ్యాహ్నం తర్వాత పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

 Read Also: మనం ఎక్కడ చమురు కొనాలో అమెరికా చెప్పడమేంటి : రాహుల్ గాంధీ

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>