కలం, వెబ్ డెస్క్: ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన నిర్వహించిన పీఏసీ సమావేశం ముగిసింది. మార్చి 7 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు (AP Assembly Sessions ) నిర్వహించాలని నిర్ణయించారు. మార్చి 5, 6, 7వ తేదీల్లో ఎమ్మెల్యేలకు ఆటలపోటీలు నిర్వహించనున్నారు. ఈ నెల 14న ఏపీ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. వ్యవసాయం, వైద్యం, విద్యపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. సమావేశంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టే బిల్లులపై కీలక చర్చలు జరిగాయి. సమావేశానికి సీఎం చంద్రబాబు సహా పలువురు మంత్రులు హాజరయ్యారు.


