కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో, ఆయన తన సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుండి బయలుదేరి ముఖ్యమంత్రి ఢిల్లీ చేరుకుంటారు.
ఈ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి (Revanth Reddy) కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. ముఖ్యంగా పార్టీ అంతర్గత వ్యవహారాలు, ఇటీవల మంత్రులపై మీడియాలో వస్తున్న వివిధ కథనాలు, రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై హైకమాండ్‌తో ఆయన చర్చించనున్నారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ రోజే సీఎం ఢిల్లీ పర్యటనకు వెళ్తుండటం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.


