Mobile Popup Ad
Mobile Popup Ad

టైటాన్ ఆఫ్ ది ఇయర్‌గా గుకేష్

కలం, వెబ్ డెస్క్:  అంతర్జాతీయ వేదికపై భారత ప్రతిభను నిలబెట్టిన చెస్ ప్లేయర్ గుకేష్ దొమ్మరాజు (Gukesh). గుకేష్‌ను టైటాన్ వాచుల సంస్థ అరుదైన గౌరవంతో సత్కరించింది. టైటన్ వాచ్‌లు ‘Titan of the Year’ రెండో ఎడిషన్‌ను ప్రకటించాయి. ఈసారి గ్రాండ్‌మాస్టర్ గుకేశ్ దొమ్మరాజును ఈ గౌరవానికి ఎంపిక చేశాయి. గత నాలుగు దశాబ్దాలుగా డిజైన్, సాంకేతికత, విశ్వాసంతో టైటన్ భారత కాలచక్రంలో భాగమైందని సంస్థ గుర్తుచేసింది. అదే తత్వానికి కొనసాగింపుగా ఈ వేదికను రూపొందించినట్లు తెలిపింది. సంప్రదాయాలను సవాల్ చేసే ప్రయాణం, అత్యుత్తమ ప్రతిభ, ప్రపంచ స్థాయిలో భారత గౌరవాన్ని పెంచే వ్యక్తులను ఇందులో గుర్తిస్తామని పేర్కొంది.

ఈ అవార్డు తొలి ఎడిషన్‌లో వింగ్ కమాండర్ రాకేశ్ శర్మను సత్కరించిన సంగతి గుర్తు చేసింది. 2026 ఎడిషన్‌లో గుకేశ్‌ను ఎంపిక చేయడం ద్వారా భయంలేని వ్యూహం, ప్రశాంతత, నిరంతర అత్యుత్తమ ప్రదర్శనను గౌరవించినట్లు వివరించింది. ఈ గుర్తింపులో భాగంగా గుకేశ్ ప్రస్థానాన్ని ప్రతిబింబించే ప్రత్యేక లిమిటెడ్ ఎడిషన్ టైమ్‌పీస్‌ను ఆవిష్కరించింది. చెస్‌బోర్డ్ నిర్మాణాన్ని గుర్తుచేసే డిజైన్‌తో ఈ వాచ్‌ను రూపొందించినట్లు తెలిపింది.

టైగర్ ఐ, బ్లాక్ అగేట్‌తో చేసిన మార్‌కెట్రీ డయల్ గుకేశ్ (Gukesh) ఆటలోని నిశ్శబ్ద మేధస్సును ప్రతిఫలిస్తుందని పేర్కొంది. డయల్‌పై ఉన్న ఇండెక్సులు చెస్ ముక్కల కదలికలను సూచిస్తాయని వివరించింది. రోటర్‌పై గ్రాండ్‌మాస్టర్ నైట్ మోటీఫ్‌తో పాటు 18 ఏళ్ల వయసులో ప్రపంచ చెస్ చాంపియన్‌గా నిలిచిన ఘనతను చెక్కినట్లు వెల్లడించింది. టైటన్ ఇన్-హౌస్ ఆటోమేటిక్ మూవ్‌మెంట్‌తో పనిచేసే ఈ వాచ్‌ను కేవలం 500 ముక్కలకే పరిమితం చేసినట్లు తెలిపింది.

రోజ్ గోల్డ్ ఫినిష్ స్టెయిన్‌లెస్ స్టీల్ కేస్, బ్లాక్ ఇటాలియన్ లెదర్ స్ట్రాప్‌తో ఈ టైమ్‌పీస్‌ను రూపొందించినట్లు వివరించింది. టైటన్ వాచ్‌ల విభాగం వైస్ ప్రెసిడెంట్ రాహుల్ శుక్లా ప్రకారం, ‘Titan of the Year’ వేదిక భారత ప్రతిభను కాలంతో పాటు నమోదు చేసే శాశ్వత గ్యాలరీగా మారుతుందని సంస్థ భావిస్తోంది. గుకేశ్ సాధించిన ఘనతలు, అతని ప్రయాణం కొత్త భారత ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబిస్తాయని ఆయన అభిప్రాయం వెల్లడైనట్లు తెలిపారు.

Read Also: అల్లు అర్జున్ మీద ప్రముఖ యూట్యూబర్ షాకింగ్ పోస్టు

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>