Mobile Popup Ad
Mobile Popup Ad

ఏఐ కంటెంట్‌కు లేబుల్.. కేంద్రం ఆంక్షలు..

కలం, డెస్క్ : ఇండియాలో తీవ్ర వివాదంగా మారిన ఏఐ కంటెంట్ (AI Content) మీద కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఏఐ కంటెంట్ ను గుర్తించేందుకు ప్రత్యేక టూల్స్ ను తీసుకురావాలని సోషల్ మీడియా సంస్థలను ఆదేశించింది. ఏఐతో జనరేట్ చేసిన కంటెంట్ కు లేబుట్ ను తప్పనిసరి చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ లేబుల్ ఈజీగా గుర్తు పట్టేలా ఉండాలని, స్పష్టంగా కనిపించాలని తెలిపింది. ఒకసారి ఏఐ కంటెంట్ కు లేబుల్ ను యాడ్ చేసిన తర్వాత దాన్ని డిలీట్ చేయడానికి గానీ.. ఎడిట్ చేయడానికి గానీ ఆప్షన్ ఇవ్వకూడదని కేంద్రం ఆదేశించింది.

అలాగే ఏఐ కంటెంట్ (AI Content) మీద ఇప్పటి వరకు అమల్లో ఉన్న బీఎన్ ఎస్, పోక్సో చట్టాల ప్రకారం నిషేధించిన కంటెంట్ ను సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ లలో ప్రచారం చేస్తే.. ఆయా సంస్థలే బాధ్యత తీసుకోవాలని కేంద్రం స్పస్టం చేసింది. పిల్లలపై లైంగిక దాడులు, అశ్లీలం, అసభ్యకరమైన కంటెంట్ ను ఎట్టి పరిస్థితుల్లో సోషల్ మీడియాలో అనుమతించకూడదని కేంద్రం తెలిపింది. ఫేక్ డాక్యుమెంట్ల తయారీ, పేలుడు పదార్థాల తయారీకి సంబంధించిన ఏఐ కంటెంట్ ను పూర్తిగా నిరోధించాలని కేంద్రం తెలిపింది.

Read Also: ఓం బిర్లా సంచలన నిర్ణయం

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>