epaper
Wednesday, February 18, 2026
epaper

పీఎంపై మహిళా ఎంపీల దాడి కుట్ర నిజమేనా? ఇదిగో వీడియో ఫుటేజ్

కలం, తెలంగాణ బ్యూరో : ప్రధాని మోడీకి మహిళా ఎంపీల నుంచి ప్రాణహాని ఉన్నదా?.. లోక్‌సభ (Lok Sabha) హాల్‌లోనే ఆయన భద్రత ప్రమాదంలో పడిందా?.. నిజంగా మహిళా ఎంపీలు ఆయనపై దాడి చేయడానికి ప్లాన్ చేశారా?.. దీన్ని ముందుగానే గమనించిన స్పీకర్ ఓం బిర్లా (Om Birla) ప్రధానికి కొన్ని సూచనలు చేశారా?.. వీటిపై చర్చ జరుగుతున్న సమయంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రెజిజు ఈ నెల 4న మహిళా ఎంపీలు చేసిన ఆందోళనకు సంబంధించిన వీడియో ఫుటేజీని మంగళవారం విడుదల చేశారు.

ప్రధాని కూర్చునే సీటు దగ్గరకు వచ్చి మహిళా ఎంపీలు ఆందోళన చేస్తున్న ఫుటేజీ బైటకు రావడంతో దానిపైన రకరకాల ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. నిరసన తెలియజేసే హక్కు తమకు ఉన్నదంటూ మహిళా ఎంపీలు స్పష్టం చేశారు. పలు పార్టీల ఎంపీలు వీరికి మద్దతు పలికారు. కానీ దాడి చేయాలన్న కుట్ర ఆ వీడియో ఫుటేజీ చూస్తే అర్థమవుతున్నదంటూ బీజేపీ మహిళా ఎంపీలు ఆరోపిస్తున్నారు. ఆ వీడియో ఫుటేజీ ఇదే..

 

Read Also: ఎంపీలే పొరపాటు చేస్తే… పార్లమెంటులో జరిగిందిదే..

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>