epaper
Wednesday, February 18, 2026
epaper

తగ్గేదేలే.. ఓటుకు రూ.5వేల నుంచి రూ.10వేలు

కలం, నల్లగొండ బ్యూరో : మున్సిపల్ ఎన్నికల(Municipal Elections) ప్రక్రియ తుది దశకు చేరుకుంది. పోలింగ్‌కు మరికొద్ది గంటల సమయం మాత్రమే మిగిలి ఉండడంతో అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించేందుకు నానా తంటాలు పడుతున్నారు. చీరలు, వెండి, ఇత్తడి సామాగ్రి, ప్రెషర్ కుక్కర్లు తదితర కానుకలు ఇచ్చి ఓట్లు రాబట్టుకునేందుకు అభ్యర్థులు రకరకాల వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఉమ్మడి నల్లగొండ (Nalgonda) జిల్లాలోని 17 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగుతుండగా అన్ని మున్సిపాలిటీలలోనూ డబ్బే ప్రధాన సమస్యగా మారింది. ఒక్కో ఓటుకు రూ.5వేల నుంచి రూ.10 వేల వరకు పంచేందుకు అభ్యర్థులు రెడీ అయ్యారు.

అయితే అభ్యర్థులు డబ్బులను ఒకే విడతలో  ఇవ్వకుండా రెండు విడతలుగా ఇచ్చేందుకు ప్లాన్ చేశారు. నిజానికి మొదటి విడత నగదును ఇప్పటికే ఇచ్చేశారు. అయితే ప్రత్యర్థులు ఎంత నగదిస్తారనే  దాన్ని బట్టి మళ్ళీ రెండో విడతలో ఆ మేర ఇచ్చేందుకు డబ్బులను సిద్ధం చేసి పెట్టుకున్నారు. డబ్బులే కాకుండా మద్యం బాటిళ్లను సైతం భారీగా పంపిణీ చేస్తున్నారు. ఒక్కో ఓటుకు ఆఫ్ బాటిల్ మద్యం ఇచ్చేందుకు అభ్యర్థులు ఆసక్తి చూపిస్తున్నారు. డబ్బుతో కానీ పని కొన్ని కొన్ని సార్లు మద్యంతో అవుతుంది. ఈ ఫార్ములానే మున్సిపల్ ఎన్నికల బరిలోకి దిగిన అభ్యర్థులు ఫాలో అవుతున్నారు.

ఒక్కో అభ్యర్థి రూ.50 లక్షలు వరకు ఖర్చు..

మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు ఒక్కొక్కరు రూ.50 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. చైర్మన్, వైస్ చైర్మన్ రేసులో ఉన్నవారు రూ.75 లక్షల నుంచి రూ.కోటి వరకు ఖర్చు చేస్తూ ఉండడం చర్చనీయాంశంగా మారుతుంది. ఒక్కో వార్డులో సగటున 3వేల ఓట్ల వరకు ఉన్నాయి. ఇందులో 1500 నుంచి 2వేల ఓట్లను రాబట్టుకుంటే గెలుపు దక్కుతుంది. ఎంత చిన్న మున్సిపాలిటీలో చూసిన ఒక్కో ఓటుకు రూ.2వేలకు తగ్గకుండా డబ్బులు పంచుతున్నారు.

Read Also: అర్జున్​ టెండూల్కర్ పెళ్లి.. ప్రధానికి సచిన్​ ఆహ్వానం

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>