కలం, వెబ్ డెస్క్: భారత్‌తో మ్యాచ్ ఆడటానికి ఓకే చెప్పిన తమకు వచ్చిన లాభం ఏమీ లేదని పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్(పీసీబీ) ఛైర్మన్ (PCB Chief) మొహ్సీన్ నఖ్వీ అన్నారు. భారత్‌తో ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సిన మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయబోమని పాకిస్థాన్ అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయం వెలువడే నిమిషాల ముందు పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ (Mohsin Naqvi) చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మొదట బంగ్లాదేశ్‌కు మద్దతుగా భారత్ మ్యాచ్‌కు నిరాకరిస్తున్నట్లు పాకిస్థాన్ ప్రకటించింది. భారత్‌లో భద్రతా కారణాలతో ఆడలేమని బంగ్లాదేశ్ చెప్పడంతో, టోర్నీ నుంచి ఆ జట్టు తప్పుకోవాల్సి వచ్చింది. దీనిని ఐసీసీ డబుల్ స్టాండర్డ్స్‌గా పీసీబీ అభివర్ణించింది.
ఈ నేపథ్యంలో ఐసీసీ, బంగ్లాదేశ్, శ్రీలంక, యూఏఈ, పాకిస్థాన్ ప్రభుత్వంతో దౌత్యపరమైన చర్చలు జరిగాయి. వాణిజ్యపరంగా, క్రీడాపరంగా కీలకమైన భారత్–పాక్ మ్యాచ్ జరగాల్సిందేనన్న ఒత్తిడి పెరిగింది. బాయ్‌కాట్ ఉపసంహరణకు ముందు మీడియాతో మాట్లాడిన నఖ్వీ (PCB Chief) , పాకిస్థాన్ తనకోసం ఏ రాయితీ కోరలేదని స్పష్టం చేశారు. బంగ్లాదేశ్ సమస్యలు ఐసీసీ చర్చలతో పరిష్కారమయ్యాక, మ్యాచ్ ఆడాలని బీసీబీ అధ్యక్షుడు అమినుల్ ఇస్లాం అభ్యర్థించారని తెలిపారు.
అయితే బంగ్లాదేశ్‌పై ఎలాంటి శిక్షలు ఉండవని ఐసీసీ (ICC) నిర్ధారించింది. 2028–2031 సైకిల్‌లో అదనపు హోస్టింగ్ హక్కులు కూడా బీసీబీకి ఇచ్చింది. దీనిపై బంగ్లాదేశ్ పాకిస్థాన్‌కు కృతజ్ఞతలు తెలిపి, ఫిబ్రవరి 15 మ్యాచ్ ఆడాలని కోరింది. ఈ పరిణామాల అనంతరం స్నేహపూర్వక దేశాల విజ్ఞప్తులు, క్రికెట్ ఆత్మను కాపాడాల్సిన అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని జట్టును మైదానంలోకి దించాలంటూ పాకిస్థాన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు ప్రకటించింది.
Read Also: టైటాన్ ఆఫ్ ది ఇయర్‌గా గుకేష్
Follow Us On: Instagram


